మట్టి చేసే ఇంద్రజాలం
“నిర్జీవ పదార్ధాలలో నుంచి జీవాన్ని చిగురింపజేయగలిగే ఏకైక అద్భుత పదార్దం మట్టి”
– సద్గురు
మట్టిలోని ఇంద్రజాలాన్ని సజీవంగా ఉంచడం కోసం మానవత్వాన్ని ఏకం చేయడం గురించే మట్టిని రక్షించు ఉద్యమం
Watch The Save Soil Documentary
కానీ...
మట్టి అంటే ఏంటి ఇంకా అది ఏం చేస్తుంది?
మనం ఈ క్రింది క్విజ్ ద్వారా చూద్దాం
ప్రశ్న 1 / 6
మట్టి అంటే ______
మట్టి మన జీవితానికి ఆధారం. కానీ...
వ్యవసాయం, అడవుల నరికివేత ఇంకా ఇతరత్రా కారణాల వల్ల భూసారం ప్రమాదకర స్థాయిలో క్షీణించింది తద్వారా మట్టి పైపొర కోతకు గురవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 52% వ్యవసాయ భూములు ఇప్పటికే నిస్సారమయ్యాయి. భూగ్రహం సంక్షోభంలో ఉంది. ఇది ఈ స్థాయిలోనే కొనసాగితే, మనకు తెలిసిన ఈ జీవనానికి ఇదే అంతం అవుతుంది.
చాలా క్షీణించింది
క్షీణించింది
స్థిరంగా ఉంది
వృక్షసంపద లేదు
భూగ్రహం సంక్షోభంలో ఉంది
ఆహార సంక్షోభం
20 సంవత్సరాలలో, 930 కోట్ల మంది ప్రజలు ఉండగా ఆహారం మాత్రం 40% తక్కువ ఉత్పత్తి అవుతుందని అంచనా.
సారం లేని మట్టి పోషక విలువలు లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే పళ్ళు కూరగాయలలో పోషకాలు 90% వరకు తగ్గిపోయాయి.
200 కోట్ల మంది ప్రజలు అనేక రకాల వ్యాధులకు దారితీసే పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు.
నీటి కొరత
క్షీణించిన మట్టి నీటిని గ్రహించలేదు ఇంకా ప్రవాహాన్ని నియంత్రించలేదు.
నీటి నిలుపుదల లేకపోవడం నీటి కొరత, కరువులు ఇంకా వరదలకు దారితీస్తుంది.
సేంద్రీయ పదార్థం దాని బరువులో 90% వరకు నీటిని పట్టి ఉంచగలదు, కాలక్రమేణా నెమ్మదిగా నీటిని విడుదల చేస్తుంది. కరువు పీడిత ప్రాంతాలకు ఇది చాలా సహాయకరంగా ఉంటుంది.
జీవవైవిధ్యంలో నష్టం
ఆవాసాలను కోల్పోవడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 27000 రకాల జీవులు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
80% పురుగుల జీవపదార్ధం పోయే స్థాయికి సంక్షోభం చేరుకుంది.
జీవవైవిధ్యం కోల్పోవడం వల్ల నేల ఆవాసాలకు అంతరాయం ఏర్పడుతుంది ఇంకా మట్టి పునరుజ్జీవనాన్నీ నిరోధిస్తుంది.
వాతావరణ మార్పు
మట్టిలో కార్బన్, మొక్కల కంటే 3 రెట్లు, వాతావరణంలో కంటే 2 రెట్లు ఎక్కువగా నిల్వ ఉంటుంది. అంటే కార్బన్ ను గ్రహించడానికి మట్టి ఎంతో కీలకం అని అర్ధం.
ప్రపంచవ్యాప్తంగా మట్టిని పునరుజ్జీవింపజేయకపోతే, అది వాతావరణ మార్పులకు దోహదపడే 850 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఇది గత 30 సంవత్సరాలలో మానవాళి మొత్తం విడుదల చేసిన ఉద్గారాల కంటే ఎక్కువ.
జీవనోపాధి కోల్పోవడం
భూసారం తగ్గడం వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భూమి క్షీణత వల్ల 74% మంది పేదలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు.
మట్టి వినాశనం అవ్వడం వల్ల ప్రపంచానికి ప్రతి ఏటా US$ 10.6 ట్రిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
సంఘర్షణ ఇంకా వలస
జనాభా పెరుగుదల ఇంకా ఆహార, నీటి కొరత కారణంగా 2050 నాటికి 100 కోట్ల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు దేశాలకు వలస వెళ్ళవచ్చు.
1990 నుండి ఆఫ్రికాలో జరిగిన 90% పైగా ప్రధాన యుద్ధాలు ఇంకా ఘర్షణలలో భూమి సమస్యలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.
ఫ్రెంచ్ విప్లవం నుండి అరబ్ స్ప్రింగ్ వరకు, సామూహిక నిరసన ఉద్యమాల వెనుక అధిక ఆహార ధరలు ఒక కారకంగా పేర్కొనబడ్డాయి
మట్టి: సంపూర్ణ పరిష్కారం
దాదాపు ప్రతి ప్రధాన పర్యావరణ సంక్షోభం కొంత వరకు లేదా ఎదో ఒక రూపంలో, మట్టి క్షీణత లక్షణం లేదా ఒక పరిణామం. అదేవిధంగా, దాదాపు ప్రతి పర్యావరణ లేదా పర్యావరణ సంబంధిత ఇబ్బందులను ఆరోగ్యకరమైన మట్టిని సృష్టించడం ద్వారా పరిష్కరించవచ్చు.
వాస్తవానికి, మన పర్యావరణంలోని ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా ప్రస్తావించకుండానే మనం పరిష్కరించగలమని అనుకోవడం ఒక అపోహ, ఎందుకంటే పర్యావరణ వ్యవస్థలోని ఏ అంశం కూడా విడిగా పనిచేయదు. జీవితం అనేది ఏకైక సంక్లిష్టమైన అద్భుతం అని, ఇవన్నీ ఒక దానితో మరొకటి అనుసంధానమై జరుగుతున్నాయని మన స్పృహలోకి వచ్చే వరకు ఏ విషయాన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించడం వీలుకాదు. అనేక విధాలుగా, మట్టి అనేది జీవం చిగురించే అంతర్లీన వేదిక. మనం మట్టిని సరిచేస్తే, మొత్తం పరిష్కరించడానికి మనకు ఉత్తమ అవకాశం ఉంటుంది.
నిపుణులు ఏమంటున్నారు?
సైన్స్ ఏం చెబుతుంది?
S.O.S - Save Our Soil - మనం మట్టిని రక్షించుకుందాం?
మట్టి నిర్వహణ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
జీవవైవిధ్యం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2400 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి ఇంకా 27,000 జీవ జాతులు కనుమరుగవుతున్నాయి
UN నివేదిక: ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూములు "వినాశనపు అంచుకు" చేరుకున్నాయి
వాతావరణ మార్పు
ప్రపంచంలోని వాతావరణ-ఒత్తిడి ఇంకా కాలుష్యం వల్ల క్షీణించిన వ్యవసాయం ఇంకా వ్యవసాయ వ్యవస్థ ఆహారం కోసం స్థిరమైన పద్ధతులకు త్వరగా మారాలి...
ఓ పృథివీ
ఈ మట్టి వాసన
ఎందుకో మరింత మృదువుగా
హత్తుకుంటుంది నన్ను,
ఆ ఆడంబరపు
పూల పరిమళం కంటే
ప్రసరిస్తున్నవి
ఒక వింత ప్రగాఢ అనుభూతి తరంగాలను
ఈ మట్టిలోని నిహిత జీవపు
బలమూ, సౌకుమార్యమూ.
కాదు కాదది కేవలమొక వ్యక్తి భావావేశం..
అవి నా జాతివి ..
.. బతుకంతా పోషించి,
కొసకు తనను శోషించే పుడమి తల్లిని
మరచి మొద్దుబారిన నా జాతి అనుభూతులవి.
ఉత్తి కాళ్ళతో నడుస్తున్న నేను,
కూలిపోయాను పట్టరాని ఉద్విగ్నతతో....
అది వర్ణనలకు అతీతం.
ఓ పృథివీ, నా జీవమా
సద్గురు కవిత
మనం ఇది సాకారం చేద్దాం!