ఆరంభం
2003లో సద్గురు తమిళనాడు అంతా తిరుగుతూ, ఊరూరా యోగా ప్రోగ్రాములు నిర్వహించారు. ఈ మూడు రోజుల ప్రోగ్రాములు ముగింపు సమయంలో ప్రజలు అంతా కలిసి ఆటలు ఆడేవారు. ఇదే ఇంతటి ఫలితాలు తెస్తున్న ఈశా గ్రామోత్సవానికి బీజం. మొదటి గ్రామోత్సవం 2004లో తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో జరిగింది. అనేక గ్రామాల నుండి వచ్చిన దాదాపు 140 జట్టులు 50,000 మంది ప్రేక్షకుల ముందు ఆడారు.
ఆటలు వ్యక్తులనూ, సమాజాలనూ ఎలా మార్చగలవో చూపించే సజీవ నమూనా ఇది. అన్ని వయసుల మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు రోజూ బయటకొచ్చి ఆడుకునేందుకు తగిన వాతావరణం సృష్టించింది. దీనివల్ల కులం, మతం, లింగ భేదాలు తగ్గాయి. యువత వ్యసనాలను అధిగమించడానికి సహాయపడింది. చిన్నప్పటి నుంచి ఆటలు ఆడని మహిళలకు కూడా ఆటల ఆనందాన్ని అందించే వేదికను ఏర్పాటు చేసింది.

విజన్
గ్రామీణ భారతదేశంలో 60% పైగా పని చేసే వయస్సులో ఉన్నవారే, అయినప్పటికీ లాభసాటి కాని వ్యవసాయం ఇంకా సమ్మిళిత వృద్ధి లేకపోవడం వల్ల వాళ్ళు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ యువత కడు పేదరికం బారిన పడి వ్యసనాలకు లొంగిపోతున్నారు. గ్రామీణ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ఇంకా గ్రామీణ సమాజాల్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావడానికి ఈశా గ్రామోత్సవం కృషి చేస్తోంది.
క్రీడలు మరియు గ్రామీణ సంస్కృతిని వైభవోపేతంగా ప్రదర్శించడం ద్వారా, ఈశా గ్రామోత్సవం సమాజాన్ని మార్చగలిగే ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఇది గ్రామస్తులను వ్యసనాల నుండి దూరం చేయడమే కాకుండా, కులాల మధ్య అడ్డంకులను తొలగించి, మహిళా సాధికారతను పెంపొందించి, గ్రామీణ స్ఫూర్తిని పునరుజ్జీవింప చేస్తోంది.
గ్రామోత్సవ
ప్రయాణం

ప్రభావం
2,02,000+
క్రీడాకారులు
17,000+
జట్లు
30,000+
గ్రామాలు
38,600+
క్రీడాకారిణులు
అవార్డులు & గుర్తింపు





మాతో భాగస్వాములవండి
గ్రామీణ సమాజాలను మార్చడంలో మాకు సహకారాన్ని అందించండి.
మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి::