ఈశా గ్రామోత్సవం వాలీబాల్ (పురుషులు)  నియమాలు

రిజిస్ట్రేషన్ నియమాలు

  1. ముందస్తు ఆన్లైన్‍ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ మరియు టీమ్ ఎంట్రీ ఉచితం. (డివిజనల్ స్థాయి పోటీల నుండి  ప్రయాణ ఖర్చులు ఇవ్వబడతాయి.)

  2. జట్టులోని ఆటగాళ్లు అందరూ ఒకే గ్రామ లేదా పట్టణ పంచాయతీకి చెందినవారై ఉండాలి. అయితే ఒకే పంచాయతీ నుండి అనేక జట్లు పాల్గొనవచ్చు. మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ పరిధిలోని జట్లు అర్హులు కారు.

  3. ఒక జట్టులో, కనీసం 6 ఆటగాళ్లు + 1 సబ్‌స్టిట్యూట్ (6+1) ఉండాలి; గరిష్టంగా 6 ఆటగాళ్లు + 6 సబ్‌స్టిట్యూట్‌లు (6+6) ఉండవచ్చు. ఒక ఆటగాడు ఒక జట్టులోనే ఆడాలి.

  4. కనీస వయస్సు: 14 సంవత్సరాలు. గరిష్ట వయస్సు: శారీరకంగా దృఢంగా ఉన్నంతవరకు వయోపరిమితి లేదు.

  5. స్కూల్, కాలేజీ & యూనివర్సిటీ విద్యార్థులు వారి పంచాయతీ జట్లలో పాల్గొనవచ్చు. అయితే స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ & రిజర్వ్ జట్లు పాల్గొనటానికి అనుమతించబడవు. నియమాలు అతిక్రమించినట్లు తెలిస్తే, ఆ జట్టుని ఏ స్థాయిలో నైన అనర్హులుగా తీర్మానిస్తారు.

  6.  క్రింద పేర్కొన్న ఆటగాళ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోనలేరు:

 

a. అంతర్జాతీయ ఆటగాళ్ళు: అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున ఆడినవారు.

 

b. జాతీయ ఆటగాళ్ళు: తమ రాష్ట్రం తరుపున ఇతర భారతీయ రాష్ట్ర స్థాయి జట్లలతో ఆడినవారు

 

c. నియమాక ఆటగాళ్లు: కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేటు కంపెనీల తరుపున కాంట్రాక్టు ప్రాతిపదికన ఆడిన ఆటగాళ్లు  

d. కేంద్ర మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయ ఆటగాళ్లు మరియు ఇంటిగ్రేటెడ్ విశ్వవిద్యాలయాలకు (దక్షిణ జోన్) ఎంపికైన ఆటగాళ్లు మరియు ఫారమ్ 3 ఆటగాళ్లు పాల్గొనడానికి అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, టోర్నమెంట్ యొక్క ఏ దశలోనైనా జట్టు తిరస్కరించబడుతుంది

 e. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, ఏ దశలోనైనా జట్టు పూర్తిగా తిరస్కరించబడుతుంది.


మ్యాచ్ నిబంధనలు

  1. మ్యాచ్ జరిగే రోజు, ప్రతి ఒక్క ఆటగాడు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలి. ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించలేని పక్షంలో, ఆటగాళ్లందరి గుర్తింపు కార్డులు ధ్రువీకరించిన తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తారు. ఆటగాళ్ల గుర్తింపు తెలుసుకోవడానికి అవసరమైన అదనపు రుజువులను తనిఖీ చేసే హక్కు మేనేజ్‌మెంట్ కమిటీకి ఉంది. ఏ జట్టయినా, ఒరిజినల్ ఆధార్ కార్డును చూపించడంలో విఫలమైతే, ఏ దశలోనైనా సరే ఆ జట్టు తిరస్కరించబడుతుంది. వారి తర్వాత స్థానంలో ఉన్న జట్టుని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. రీమ్యాచ్‍లు  జరపబడవు.

  2. జట్టు పాల్గొనే విషయంలో, తుది నిర్ణయం నిర్వాహక కమిటీ తీసుకుంటుంది.

  3. మ్యాచ్‍లు నాకౌట్/ లీగ్ పద్దతిలో జరపబడుతాయి.

  4. మొదటి మ్యాచ్ కోసం ఇచ్చిన గ్రూప్ ఫోటోలో ఉన్న ఆటగాళ్లు మాత్రమే అన్ని మ్యాచ్‍లలోను ఆడగలరు. మొదటి లెవెల్ తర్వాత జట్టులోని ఆటగాళ్లను మార్చడం కుదరదు. 

  5. నిర్వాహక కమిటీకి, ఏ దశలోనైనా, మ్యాచ్‍లను లేదా మ్యాచ్ నిబంధనలను మార్చే హక్కు ఉంటుంది.

  6. మద్యం ఇంకా ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్న ఆటగాళ్లను టోర్నమెంట్ నుంచి నిషేదించడం జరుగుతుంది. 

  7. జట్టులోని 6 ప్రధాన ఆటగాళ్లు మ్యాచ్ మొదలయ్యే 30 నిమిషాలకు ముందే మ్యాచ్ జరిగే చోటుకి చేరుకోవాలి.

  8. మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఆటగాళ్లు రాకపోయినట్లయితే, ప్రత్యర్థి జట్టుని విజేతగా ప్రకటించడం జరుగుతుంది.

  9. క్లస్టర్ స్థాయి మ్యాచ్‌లకు స్టాండింగ్ పద్ధతి అమలు చేయబడుతుంది. డివిజనల్ మరియు ఫైనల్ స్థాయి మ్యాచ్‌లకు రొటేషనల్ పద్ధతి అమలు చేయబడుతుంది.

  10. ఏదైనా జట్టుకు ప్రత్యర్థి జట్టుపై లేదా ఆటగానిపై ఫిర్యాదు ఉంటే, సరైన సాక్ష్యాధారాలను సమర్పించాలి. అప్పుడే చర్యలు తీసుకోబడతాయి. ఫిర్యాదు రుజువైతే, ఆ జట్టు లేదా ఆటగాడు ఏ దశలోనైనా తొలగించబడతారు మరియు తదుపరి స్థానంలో ఉన్న జట్టు విజేతగా ప్రకటించబడుతుంది. రీమ్యాచ్‌లు జరపబడవు.

  11. పాల్గొనే విషయంలో - ప్రత్యర్థి ఆటగాళ్ళు/జట్లపై ఫిర్యాదు ఉన్నట్లయితే, కనీసం 3 రోజుల ముందే తెలియజేయాలి. ఈ సమయం తర్వాత ఇచ్చిన ఫిర్యాదులు పరిగణనలోకి తీసుకోబడవు. ఫిర్యాదు ఇంకా సాక్ష్యాధారాలు నిజమని రుజువైతే, ఆ జట్టుపై తగిన చర్యలు తీసుకోబడతాయి.

  12. రిఫరీదే తుది నిర్ణయం.

  13. జట్టు కెప్టెన్ మాత్రమే ఆట జరిగే సమయంలో రిఫరీ లేదా మేనేజ్మెంట్ కమిటీతో మాట్లాడవచ్చు. కోచ్‌లు మరియు ఇతర ఆటగాళ్లు వాదించకూడదు. లేకపోతే, ఆ జట్టు టోర్నమెంట్ నుంచి అనర్హతకు గురవుతుంది.

  14. పైన పేర్కొన్న నిబంధనలను ఏ జట్టు అయినా ఉల్లంఘిస్తే, టోర్నమెంట్ ఏ దశలోనైనా ఆ జట్టు తొలగించబడుతుంది.

సాధారణ నియమాలు

ప్రమాదాల విషయమై సంసిద్ధత:

  • ఈశ గ్రామోత్సవం ద్వారా జరపబడుతున్న వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో చోటుచేసుకోగల స్వాభావిక నష్టాలను ఇంకా ప్రమాదాలను పాల్గొనేవారు గుర్తించి  అర్థం చేసుకున్నారు; టోర్నమెంట్ లో ఒకవేళ ఏవైనా వ్యక్తిగత గాయాలు, ఆస్తి నష్టాలు లేదా ఇతర నష్టాలు సంభవిస్తే, వాటి బాధ్యతను పాల్గొనే వారు స్వచ్చందంగా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నారు.

మాఫీ మరియు రిలీజ్ అఫ్ లయబిలిటీ:

  • పాల్గొనేనే వారు, తమ తరుపున, తమ వారసుల(heirs) తరుపున, తమ ఎక్జిక్యూటర్లు (executors) తరుపున, ఇంకా తమ అస్సైన్స్ (assigns) తరుపున - తాము టోర్నమెంట్ లో పాల్గొనడం వల్ల, తమకు కలగ గల గాయాలు, డామేజ్‌లు మరియు  నష్టాలకు -  టోర్నమెంట్ నిర్వాహకులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు, అధికారులకు ఇంకా అన్ని సంబంధిత పార్టీలకు (parties) ఎటువంటి సంబంధం ఉండదని, వారు వాటికి బాధ్యలు కారని అంగీకరిస్తున్నారు. 

నష్టపరిహారం: 

  • పాల్గొనేవారు, తాము ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న కారణంగా ఏవైనా  క్లెయిమ్‌లు, డిమాండ్‌లు, వ్యాజ్యాలు లేదా చర్యలు ఉత్పన్నమయితే, వాటి విషయంలో టోర్నమెంట్‌ నిర్వాహకులకు, స్పాన్సర్‌లకు, వాలంటీర్లకు, అధికారులకు, అలాగే అన్ని సంబంధిత పార్టీలకు ఎటువంటి బాధ్యత లేదని ఒప్పుకుంటున్నారు. అలాగే, అలా తలెత్తిన వ్యాజ్యాలు లేదా చర్యల కారణంగా, తమని తాము డిఫెండ్ చేసుకోవడం కోసం టోర్నమెంట్‌ నిర్వాహకులు ఏవైనా ఆర్ధిక వ్యయాలు చేయవలసి వస్తే, వారికి ఆ నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని ఒప్పుకుంటున్నారు.

వైద్య చికిత్స: 

  • టోర్నమెంట్ లో ఏవైనా గాయాలు కలిగితే, వైద్య చికిత్స లేదా అత్యవసర చికిత్స పొందడానికి పాల్గొనే వారు సమ్మతిస్తున్నారు. ఆ  చికిత్స కు అయ్యే ఖర్చుకు - అలాగే ఆ చికిత్స వల్ల ఏవైనా పర్యావసానాలు చోటు చేసుకుంటే, వాటికి - తామే బాధ్యత వహించడానికి అంగీకరిస్తున్నారు. 

ప్రవర్తనా నియమావళి: 

  • పాల్గొనేవారు, టోర్నమెంట్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు సూచించే  నియమ నిబంధనలు మరియు ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటామని అంగీకరిస్తున్నారు. నియమ నిబంధనలు పాటించడంలో  విఫలమైతే, పాల్గొనేవారిని టోర్నమెంట్ నుంచి తొలగిస్తారని, ఆ విషయంలో నిర్వాహకులకు ఎటువంటి బాధ్యత ఉండదని పాల్గొనేవారు అంగీకరిస్తున్నారు.